నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై షర్మిల సీరియస్..ఇదేనా ఆరోగ్య తెలంగాణ?

-

నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై షర్మిల సీరియస్ అయ్యారు. ఇదేనా ఆరోగ్య తెలంగాణ? అని నిలదీశారు షర్మిల. నిజామాబాద్‌ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తిని లాగుతూ తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ వీడియోపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌ స్పందించారు. ఆ వీడియోలో ఉంది ఆస్పత్రి సిబ్బంది కాదని.. రోగితో వచ్చిన సహాయకులు అని స్పష్టం చేశారు. అయితే.. దీనిపై షర్మిల స్పందించారు. దొర గారూ..ఇదేనా ఆరోగ్య తెలంగాణ ? రోగులను నేలపై లాక్కొని పోవడం కార్పొరేట్ వైద్యమా?స్ట్రెచర్లు,వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా? అని నిలదీశారు. ఏటా 11వేల కోట్ల బడ్జెట్ అంటూనే..రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన.ఇది మీరు చెప్తున్న ఆరోగ్య తెలంగాణ కాదు..ప్రజలు చూస్తున్న “అనా రోగ్య తెలంగాణ” అంటూ ఫైర్‌ అయ్యారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news