వైఎస్సార్ బ్రతికుంటే రాహుల్ గాంధీ పీఎం అయ్యేవారు: షర్మిల

-

తెలంగాణ ఎన్నికలకు మరో నాలుగు వారాల సమయం ఉండగా వైఎస్సార్ తనయురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకుని ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే వారికి నిరాశను మిగిల్చింది. YSRTP అనే పార్టీతో తెలంగాణాలో రాజన్న రాజ్యం కోసం పోరాడుతున్నా అని చెప్పింది షర్మిల, కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయట్లేదని ప్రకటించి ఉసూరుమనిపించింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మా తండ్రి వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ పాటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పీఎం అయ్యి ఉండేవారంటూ బాధపడ్డారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం 35 సంవత్సరాలు శ్రమించారు, ఆయన నేతృత్వంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అంటూ షర్మిల ఆనాటి స్మృతులను గుర్తు చేసుకుంది షర్మిల.

వైఎస్సార్ కు రాజీవ్ గాంధీ కుటుంబం అంటే చాలా అభిమానం అంటూ షర్మిల మనసులోని మాటను చెప్పారు. అప్పట్లో రాహుల్ గాంధీని పీఎం ను చేయాలన్న మాటను వైఎస్సార్ మొదటగా అన్నారు, ఆయనపై ఉన్న అభిమాని ఇప్పుడు సోనియా మరియు రాహుల్ లు నాపైన చూపిస్తున్నారు అంటూ షర్మిల చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news