షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినప్పటి వ్యూహాత్మకంగా వ్యవరిస్తున్నారు. కేసీఆర్‌పై సమయానికి తగ్గట్టు విమర్శలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈమె రాజకీయ పార్టీపై కూడా జనాల్లో ఎన్నో అనుమానాలు ఉండగా.. వాటికి ఆమె ఈరోజు చెక్ పెడతారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా.. ఎప్పుడూ కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఎలా అనుకుందో ఏమో ఇప్పుడు కేంద్రంపై బాణాలు ఎక్కుపెట్టింది.
ఈ మేరకు ప్రధాని మోడీ దేశ ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పడంతో ఈ వ్యాఖ్యలపై షర్మిల తనదైన స్టైల్‌లో సోషల్ మీడియాలో స్పందించారు. దేశంలో 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత కేంద్రంపైనే ఉందని తెలిపారు.
అలాగే వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలు పక్కన పెట్టాలని కోరారు. ఇప్పుడు అనసవర రాజకీయాలు మాని రాబోయే థర్డ్ వేవ్ పై దృష్టి పెట్టి సమర్థవంతంగా ఎదుర్కోవటానికి సిద్ధం కావాలన్నారు. ఆలోపు వ్యాక్సిన్ అందరికీ అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఏ విధంగా అయితే అత్యంత వేగంగా పూర్తి చేస్తారో అలాగే వ్యాక్సిన్ విషయంలో పనిచేయాలని కోరారు.