ఏపీలో కరోనా మహమ్మారి కాస్త తగున్నట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7796 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,68,112 కు పెరిగింది.
ఒక్కరోజు వ్యవధిలో మరో 77 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 11,629 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,07,588 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. నేడు కొత్తగా 14,641 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 16,48,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇవాళ ఏపీ వ్యాప్తంగా 89,732 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది వైద్యశాఖ. కాగా ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూను జూన్ 20 వరకు పొడిగించింది జగన్ సర్కార్. అయితే జూన్ 10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడగిస్తున్నట్లు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి పగలు 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. అటు ఉ.8 గంటల నుంచి మ.2 గంటల వరకు అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి.