తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టి ఏడాది దాటేసింది…తన తండ్రి వైఎస్సార్ పేరిట…వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. అయితే షర్మిల పార్టీ తెలంగాణలో బాగా ప్రభావం చూపుతుందని మొదట్లో ప్రచారం జరిగింది…కానీ షర్మిల పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది..అలాగే ఆమె కొత్త ఎత్తులతో రాజకీయం చేయడంలో విఫలమైనట్లే కనిపించారు..ప్రజా సమస్యలపై గళం విప్పడం, పాదయాత్ర చేయడం, కేసీఆర్ ప్రభుత్వంపై రాజకీయ పరమైన విమర్శలు చేయడం…అంటే రెగ్యులర్ ఫార్మాట్ లోనే షర్మిల రాజకీయం నడిపించుకుంటూ వచ్చారు.
దీని వల్ల తెలంగాణలో షర్మిల పార్టీ ఆశించిన విధంగా రాణించలేకపోతుంది. ఇలాంటి తరుణంలోనే షర్మిల ఊహించని విధంగా సరికొత్త రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు. విమర్శించే విధానాన్ని మార్చారు. జనాలకు రీచ్ అయ్యేలా…కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. అవసరమైతే పక్కనే ఉన్న తన అన్న, ఏపీ సీఎం జగన్ ని సైతం షర్మిల వదలడం లేదు…కేసీఆర్ తో కలిపి జగన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు.
ఇక ఎప్పుడైతే విజయమ్మ వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి…షర్మిల పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారో…అప్పటినుంచి సీన్ మారిపోయింది. పూర్తిగా షర్మిల పార్టీలో మార్పు వచ్చింది. అలాగే విజయమ్మ తెరవెనుక ఉండి…వైఎస్సార్ సన్నిహితులని కలుస్తూ…షర్మిల పార్టీకి మద్ధతు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షర్మిల సైతం…సీనియర్ నేత డి. శ్రీనివాస్ ని కలవడం ఆసక్తికరంగా మారింది.
గతంలో వైఎస్సార్ తో కలిసి డీఎస్ కాంగ్రెస్ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. డీఎస్ పిసిసి అధ్యక్షుడుగా ఉంటే…వైఎస్సార్ సీఎల్పీ లీడర్ గా ఉండేవారు. ఇద్దరు కలిసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక వైఎస్సార్ చనిపోయాక రాజకీయాలు మారిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణ రావడం…డీఎస్ ఆ పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ ఆయన టీఆర్ఎస్ కు దూరం జరగడం, ఇప్పుడు తటస్థంగా ఉండిపోవడం జరిగాయి.
అయితే డీఎస్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది..ఈ తరుణంలో షర్మిల…డీఎస్ ని కలవడం చర్చనీయాంశమైంది. పైగా తెలంగాణ ప్రజల్లో వైఎస్‌ఆర్‌పై అభిమానం చెక్కుచెదరలేదని.. షర్మిల కచ్చితంగా సీఎం అవుతారని డీఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తుంటే షర్మిల తెరవెనుక కొత్త రాజకీయం ఏదో నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో షర్మిల రాజకీయం ఎలా ఉంటుందో.