కేటీఆర్ ట్వీట్ కు కాంగ్రెస్ ఎంపీ కౌంట‌ర్‌.. దండం పెట్టిన మంత్రి

-

ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ మందులకు బాగా డిమాండ్ ఉండ‌టంతో వీటిని కావాల‌నుకునే వారు మెయిల్‌, ట్విట్ట‌ర్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో కేటీఆర్ గురువారం ట్వీట్ చేశారు. ఓ న‌మూనా ఫొటోను పెట్టి, దాని ప్ర‌కారం అప్లై చేసుకోవాల‌ని సూచించారు. అయితే మ‌రి కొద్ది సేప‌టికే ఈ మందుల పేర్ల‌ను ఇలా ప‌ల‌క‌రాకుండా ఎలా పెట్టారంటూ మ‌రో ఫ‌న్నీ ట్వీట్ చేశారు. ఇక దీన్ని కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌కు ట్యాగ్ చేసి, స్పందించాలంటూ కోరారు.

అయితే మామూలుగానే ఇంగ్లీష్‌లో ఇర‌గ‌దీసే శ‌శిథ‌రూర్‌.. కొన్ని సార్లు ఎవ‌రికీ అర్థం కాని ఇంగ్లీష్ ప‌దాల‌ను వాడుతుంటారు. అవి అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. అయితే కేటీఆర్ ట్వీట్‌పై శుక్ర‌వారం శ‌శిథ‌రూర్ ఓ కౌంట‌ర్ వేస్తూ స్పందించారు.

ఆ ట్వీట్‌ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఏకంగా 29 అక్షరాలతో ఓ పెద్ద ప‌దం వాడారు ట్వీట్ లో. CoroNil (కరోనిల్), CoroZero (కరోజీరో), GoCoroNaGo! (గో కరోనా గో) వంటి ప‌దాల‌తో కాస్త వెట‌కారంగానే స‌మాధానం ఇచ్చారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం కేటీఆర్ స్పందించారు. ‘దేవుడా.. ఓ డిక్షనరీని బయటకు తీయవలసి వచ్చింది’ అంటూ దండం పెడుతున్న ఎమోజీని వాడుతూ ట్వీట్ చేశారు. అంటే ఆ ప‌దాలు కేటీఆర్‌ను అంత‌గా ఇబ్బంది పెట్టాయ‌న్న మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news