కేసీఆర్ ప్రభుత్వం బాటలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నడిచేలా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ సర్కార్ తెలంగాణలో గొర్రెలు అలాగే మేకలను… యాదవులకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా అదే రూట్ లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. యాదవ, కురబలకు బిసి కార్పొరేషన్ ద్వారా గొర్రెలు అలాగే మేకలు.. పంపిణీ చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/chandrababu-meka.jpg)
వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ యూనివర్సిటీలలో… ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి రిటైర్మెంట్ వయస్సును… 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అంతేకాదు సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రోత్సాహాలు ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్, పశు వైద్య విద్యార్థుల స్కాలర్షిప్ కూడా ₹7,000 నుంచి పదివేల రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో పీజీ విద్యార్థులకు 12 వేల రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం.