వయాగ్రా కలిసిన నీటిని తాగిన గొర్రెలు.. తర్వాత ఏం జరిగిందంటే..?

-

శృంగార సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా మాత్రలను ఫైజర్ అనే కంపెనీ తయారు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ మాత్రలను వాడితే శృంగారంలో చురుగ్గా పాల్గొనేందుకు వీలు కలుగుతుంది. అయితే దురదృష్టవశాత్తూ ఆ మాత్రలు కలిసిన నీటిని కొన్ని గొర్రెలు తాగాయి. దీంతో ఆ గొర్రెలు విపరీతమైన అవస్థ పడుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

sheep in ireland drunk viagra mixed water what happened next

దక్షిణ ఐర్లాండ్‌లోని రింగాస్కిడ్డీ అనే హార్బర్‌కు ఆనుకుని ఉన్న నదిలో ఇటీవల కొన్ని గొర్రెలు నీటిని తాగాయి. అయితే అక్కడికి సమీపంలో ఉన్న ఫైజర్ కంపెనీ తాము తయారు చేసే వయాగ్రా మాత్రల పొడిని అనుకోకుండా ఆ నదిలో కలిపింది. ఈ క్రమంలో సుమారుగా 755 టన్నులకు పైగా వయాగ్రా మాత్రల పొడి ఆ నదిలో కలిసింది. అయితే ఆ నీటిని 80వేల గొర్రెలు, కొన్ని పశువులు తాగాయి. ఈ క్రమంలో ఆ గొర్రెలకు తీవ్రమైన సమస్య ఎదురైంది.

ఆ గొర్రెలను పరీక్షించిన వైద్యులు అవి శృంగార కోరికతో రగిలిపోతున్నట్లు గుర్తించారు. అవి శృంగార కాంక్ష కలిగిన సైకోల్లా ప్రవర్తిస్తున్నాయని తెలిపారు. అయితే పలువురు స్థానికులు ఈ విషయంపై కోర్టుకెక్కారు. ఫైజర్ కంపెనీ నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గతంలోనూ ఆ కంపెనీ వదులుతున్న వాసనలకు చుట్టు పక్కల నివసించే ప్రజలు, జంతువుల్లో శృంగార కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయని పలువురు కోర్టుకెక్కగా, ఇప్పుడు తాజాగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మరి ఈ సారి ఆ కంపెనీ ఏం చేస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news