విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంట తెచ్చుకునే లగేజ్ పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక నుంచి విమాన ప్రయాణీకులు ఒకటి కంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్ లను తీసుకురాకుండా ఎయిర్ పోర్టు అథారిటీలకు, విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఎయిర్ పోర్టులలో రద్దీ తగ్గించడం తో పాటు భద్రతా పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీఐఎస్ఎఫ్ ఐజీ విజయ్ ప్రకాశ్ తెలిపారు.
అంతే కాకుండా దీనికి సంబంధించిన ఉత్తర్వలును కూడా ఈ రోజు డీజీసీఏ సెక్యురిటీ విభాగానికి జారీ చేశారు. దీంతో నేటి నుంచి విమాన ప్రయాణీకులు ఒకటి మించి హ్యాండ్ బ్యాగ్ లతో ప్రయాణం చేయలేరు. కేవలం ఒక్క హ్యాండ్ బ్యాగ్ కు మాత్రమే ఎయిర్ పోర్టు అథారిటీ వాళ్లు అనుమతి ఇస్తారు. కాగ ఎయిర్ పోర్టులలో భద్రత దృష్ట్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు.