హై కోర్టులో రాష్ట్ర ప్ర‌భుత్వానికి షాక్.. ఫీజ‌ల పెంపు జీవో కొట్టివేత‌

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి హై కోర్టు షాక్ ఇచ్చింది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజుల‌ను కేటాయిస్తు రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో ను రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం హై కోర్టు కొట్టివేసింది. కాగ రాష్ట్రంలో ఉన్న ప్ర‌యివేటు వైద్య కాలేజీల్లో 2017 – 2020 కి గాను ఫీజుల‌ను పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం 2017 మే 9 ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల‌ను కొంత మంది విద్యార్థులు స‌వాల్ చేస్తు.. హై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

టీఏఎఫ్ఆర్‌సీ సిఫార్సు లేకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం ఏక ప‌క్షంగా ఫీజుల‌ను పెంచార‌ని హై కోర్టు కు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో పెద విద్యార్థులు న‌ష్ట పోతార‌ని పిటిష‌న్ లో తెలిపారు. దీంతో రాష్ట్ర హై కోర్టు ఈ కేసును ఇప్ప‌టి వ‌ర‌కు విచారించి తాజా గా ఈ రోజు తుది తీర్పును వెల్ల‌డించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం, పీజీ వైద్య విధ్యార్థుల వాద‌న‌లను హై కోర్టు విన్న త‌ర్వాత.. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో ను కొట్టివేసిది.

గ‌తంలో అంటే.. 2016-19 లో ఉన్న ఫీజుల‌ను తీసుకోవాల‌ని పీజీ వైద్య కాలేజీల‌కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అధిక ఫీజులు వ‌సూల్ చేస్తే.. వాటిని 30 రోజుల్లో తిరిగి విద్యార్థుల‌కు చెల్లించాల‌ని తెలిపింది. అలాగే కోర్సు పూర్తి అయిన వారి మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల‌ను కూడా ఇచ్చేయాల‌ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news