మూడో వన్డేలో ప్లాస్టిక్ కప్పులు వాడినందుకు, షాక్ ఇచ్చిన అధికారులు…!

-

ప్లాస్టిక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందో అందరికి తెలిసిన విషయమే. ప్లాస్టిక్ కనపడితే నిషేధించాలి అంటూ పిలుపు ఇస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ వాడకం నిషేదిస్తేనే కాలుష్యం సహా అనేక ,సమస్యల నుంచి బయటపడతామని ప్రభుత్వం చెప్తుంది. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అధికారులు మాత్రం వినలేదు.

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో వన్డేకు బెంగళూరు ఆతిధ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కప్పులు వాడారు స్టేడియం అధికారులు. దీన్ని సీరియస్ గా తీసుకున్న బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) అధికారులు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కర్ణాటకలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై గతేడాది,

బిజెపి ప్రభుత్వం నిషేధం విధించినా సరే వినకుండా వాటిని వాడినందుకు గాను కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ)కు రూ.50వేల జరిమానా విధించారు మున్సిపల్ అధికారులు. దీనిపై స్పందించిన బీబీఎంపీ కమిషనర్ బీహెచ్ అనిల్ కుమార్, ఈ ప్లాస్టిక్ వాడొద్దంటూ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని, అయినా స్టేడియంలో ఈ కప్పులు వాడటం కేఎస్‌సీఏ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news