వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని ప్రాంతాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటుగా అన్ని ప్రాంతాలలో ప్రజలు అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని వ్యవహరిస్తున్న నాయకత్వ లక్షణాలు చూసి చాలా మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరైన కొడుకుని రాష్ట్రానికి ఇచ్చాడు అంటూ సీనియర్ నేతలు వైయస్ జగన్ అనుసరిస్తున్న రాజకీయ ఆలోచనలపై కామెంట్లు చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో తాను కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన భజన పత్రికలు మరియు మీడియా చిత్రీకరిస్తున్నారని మాట్లాడుతూ తన పార్టీ వ్యవహారాలను కార్యక్రమాలను చూసే తలశిల రఘురాం అదేవిధంగా తన వెంటే ఉంటూ ముందునుండి నాకు అండగా ఉన్న కొడాలి నాని ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే అంతే కాదు కేవలం కమ్మ సామాజిక వర్గం మాత్రమే కాదు అన్ని సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మైనార్టీలు అందరూ కలిసి ఓటు వేస్తే నేను ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం జరిగిందని అంతే కాకుండా తన మేనత్త కూడా ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళు అని నాకు ఇక్కడ కూడా వ్యాపారాలు ఉన్నాయి అని తెలియజేసిన వైయస్ జగన్ రిపబ్లిక్ డే వేడుకలను ముందు వైజాగ్ నగరంలో చేయాలని భావించినా తాజాగా మాత్రం మళ్లీ విజయవాడ నగర మునిసిపల్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతం ఎక్కడికో తరలిపోతోంది అన్న అభద్రతాభావంతో ఉన్న కృష్ణ గుంటూరు ప్రజల్లో ధైర్యం నింపడానికి వైఎస్ జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో వైయస్ జగన్ ఒకవేళ వైజాగ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసి ఉంటే కృష్ణ, గుంటూరు, కోనసీమ ప్రాంతాల్లో అల్లర్లు క్రియేట్ చేయాలని టిడిపి నేతలు అనుకున్న తరుణంలో జగన్ లేటెస్ట్ వ్యూహంతో టిడిపి పెద్ద తలకాయలు కు మైండ్ బ్లాక్ అయినట్లు అయిందని టిడిపి పార్టీ లో వినపడుతున్న టాక్. ఈ దెబ్బతో విజయవాడలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలతో రాజధాని ఈ ప్రాంతం నుండి జగన్ తీసుకుపోతున్నాడు అని అన్నా నోర్లు ఇప్పుడు మూసుకునే పరిస్థితికి చేరిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.