ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి వైయస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పట్ల ఏపీ ప్రజలంతా చాలా సంతోషం గా ఉండటంతో వైసిపి పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు అంటూ ఎప్పటినుండో ఉన్న ముద్ర తాజాగా వైయస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ అంశంతో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని సరైన నిర్ణయం వైయస్ జగన్ చేసుకున్నారని రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు జగన్ తీసుకున్న నిర్ణయాలకు జై కొడుతున్నారు.
దీంతో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ తెరపైకి తెచ్చిన వికేంద్రీకరణ అంశం పేరుతో రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేయాలని విపక్ష పార్టీలు భావించిన సరైన మద్దతు రాకపోవడంతో ఇప్పుడు ఫుల్ కన్ ఫ్యూజన్ లో పడిపోయారు ప్రతిపక్ష పార్టీ నేతలు.
ఇటువంటి తరుణంలో ప్రజలంతా పాజిటివ్ గా మూడు రాజధానుల విషయంలో ఉండటంతో త్వరలోనే మోడీని రాష్ట్రానికి తీసుకురావడానికి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడానికి సీఎం జగన్ రెడీ అయినట్లు ఈ విషయం మోదీ కూడా తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి రెడీ అవుతున్నట్లు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని తీసుకున్న అద్భుతమైన వ్యూహాలకు ఫుల్ సపోర్ట్ ఇవ్వటానికి ఏపీలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఏపీ మీడియాలో అదేవిధంగా ఢిల్లీ వర్గాల్లో వినబడుతున్న టాక్.