షాకింగ్; గ్రహాంతర వాసుల జాడ దొరికింది : పెంటగాన్‌.. ఇదిగో యూఎఫ్‌ఓ వీడియో..

-

గ్రహాంతర వాసులు, ఫ్లైయింగ్ సాసర్స్ గురించి ఎన్ని ప్రచారాలు జరిగినా సరే అగ్ర రాజ్యం అమెరికా మాత్రం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం అంటూ లేదు. ఇన్నాళ్ళు అవి తప్పుడు ప్రచారాలు, అసలు అలాంటివి ఏమీ లేవు అని చెప్తూ ఉంటుంది అమెరికా. కాని ఇప్పుడు అమెరికానే కొన్ని సంచలన వీడియో లను విడుదల చేసింది. నిన్న పెంటగాన్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు అనేక అనుమానాలకు వేదికగా మారింది.

ఫ్లైయింగ్ సాసర్స్ కు సంబంధించిన మూడు వీడియోలను ఆన్లైన్ లో పెట్టింది. అసలు ఇప్పటికిప్పుడు ఎందుకు అమెరికా ఎందుకు విడుదల చేసింది అనేది తెలియదు గాని… ఈ మూడు వీడియోలు 2004 మరియు 2015 లో శిక్షణా విమానాల పైలెట్ల ద్వారా బయటకు వచ్చాయని చెప్పింది. రెండు వీడియోలను న్యూయార్క్ టైమ్స్ 2017 లో ప్రచురించింది. ఇతర వీడియోను టు ది స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూప్, ఒక మీడియా మరియు ప్రైవేట్ సైన్స్ సంస్థ విడుదల చేసింది.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, 2004 వీడియో పసిఫిక్ మీదుగా 100 మైళ్ళ దూరంలో జరిగిన ఒక సంఘటనను చూపిస్తుంది. ఇద్దరు నేవీ ఫైటర్ పైలట్లు నీటి పైన ఒక పొడవైన వస్తువును కనుగొన్నారు. అది త్వరగా వెళ్లిపోయింది. తాను ఎప్పుడు అంత వేగవంతమైన వస్తువుని చూడలేదు అని పైలట్లలో ఒకరైన కమాండర్ డేవిడ్ ఫ్రేవర్ వివరించారు. 2015 వీడియోలు వస్తువులు ఆకాశంలో వేగంగా కదులుతూ ఉన్నట్టు చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news