కేరళలో నర బలి సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్-లైలా భార్యాభర్తలు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వీరు వాటి నుంచి బయటపడడంతోపాటు సిరిసంపదలు కలుగుతాయన్న ఉద్దేశంతో నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరికి మహ్మద్ షఫీ అనే వ్యక్తి తోడయ్యాడు. అందరూ కలిసి నరబలికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కడవంతర, కాలడీలకు చెందిన రెస్లీ, పద్మ అనే ఇద్దరు మహిళలతో షఫీ సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేశాడు.
పథకంలో భాగంగా గత నెల 26న ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి వారిని బలిచ్చాడు. అయితే నరబలి కేసు విచారణలో వణికించే విషయాలు…వెలుగులోకి వస్తున్నాయి. రెస్లీనీ 56ముక్కులుగా…పద్మ ఐదు ముక్కలు చేశారు భగవత్ సింగ్ దంపతులు, ఎంజెంట్ మహ్మద్ షషి. ఇక ఆ ఇద్దరిని చంపినా అనంతరం వారి శరీరాన్ని తిన్నారు. జూన్ 8 మరియు సెప్టెంబరు 26న సాయంత్రం 5-6 గంటల సమయంలో నరబలి ఇచ్చారు. కాగా నరబలి నింధితులకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇక అటు నరబలి ఘటనపై స్పందించిన సిఎం పినరయి విజయన్.. త్వరగతినా కేసును విచారణ చేపట్టాని ఆదేశాలు జారీ చేశారు.