టీం ఇండియా క్రికెట్ లో చోటు సంపాదించుకోవడం అనేది ఒక కల అని చెప్పాలి. అయితే చాలా మంది చోటు దక్కించుకున్న తర్వాత కూడా నిలకడగా ఆడలేక బయటే ఉండిపోయారు. అటువంటి చాలా మంది క్రికెటర్ లలో ఒకరే పంజాబ్ కు చెందిన గురు కీరత్ సింగ్ మాన్. ఈ రోజు కాసేపటి క్రితమే క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. గురు కీరత్ సింగ్ కు ప్రస్తుతం 33 సంవత్సరాలు ఇండియా తరపున కేవలం మూడు వన్ డే లు మాత్రమే ఆడి ఉన్నాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం రెగ్యులర్ గా ఆల్ రౌండర్ కోటాలో వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన అనుభవం ఉంది. అందులో భాగంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, బెంగుళూరు, కోల్కతా మరియు గుజరాత్ లకు ఆడాడు.
ఐపీఎల్ చరిత్రలో కేవలం 41 మ్యాచ్ లు మాత్రమే ఆడగా అందులో 511 పరుగులు మరియు 5 వికెట్లు తీయగలిగాడు. రంజీల్లో అయితే పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.