షాకింగ్; పోస్ట్ మార్టం పూర్తి అయ్యాక లేచి వచ్చేసాడు…!

-

చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతికి రావడం సాధ్యమవుతుందా…? అసలు జరిగే పనేనా…? అసలు ఈ భూమి మీద ఇప్పటి వరకు అలాంటి సంఘటన ఎక్కడా జరగలేదు. అలా జరిగింది అంటే అది నిజంగా సంచలనమే. ఎక్కడైనా వైద్యుల పొరపాటు ఉంటే మినహా అలా జరగడం అనేది సాధ్య౦ కాదు. ఎక్కడో చనిపోయారు అని భావించిన తర్వాత లేచి బయటకు రావడం జరిగేది.

ఇప్పుడు అనూహ్యంగా ఒక ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది ఒక ఆశ్చర్యకర సంఘటన. కుమారపురం పంట కాలవలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత అతన్ని కావాడి చిన్న యేసుగా పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసారు. అనంతరం అంత్యక్రియలకు అంతా సిద్దం చేసారు కుటుంబ సభ్యులు.

అంతా సిద్దమయ్యాక చిన్నా ఇంటికి తిరిగి వచ్చాడు. దీనితో పోలీసులు కూడా షాక్ అయ్యారు. అటు బంధువులకు కూడా కాసేపు ఎం జరుగుతుందో అర్ధం జరుగుతుందో అర్ధం కాలేదు. దీనితో పోలీసులు కూడా కంగు తిన్నారు ఒక్కసారే. అయితే ఆ మృతదేహం ఎవరిది అయి ఉంటుంది అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు పిఠాపురంలో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news