మొదటిసారి భారత్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఘనస్వాగతం లభించిన విషయం తెలిసిందే. తొలి రోజు పర్యటన ఆద్యంతం అత్యంత స్నేహపూరిత వాతావరణం సాగింది. రెండో రోజు ఢిల్లీలోనే ట్రంప్ గడపనున్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. అయితే తొలి రోజున గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో విజిటర్స్ బుక్ లో తన వ్యాఖ్యలు రాసిన ట్రంప్ సంతకం చేశారు. ఆ తర్వాత కూడా పలు చోట్ల ఆయన సంతకం చేశారు. అయితే ఇప్పుడు ట్రంప్ పర్యటనపైనే కాదు, ఆయన చేసిన సంతకం ఆసక్తిదాయకంగా ఉంది.
కలిపిరాతలో ఉన్న ట్రంప్ సంతకంపై సామాజిక మాధ్యమాల వేదికగా సెటైర్లు పండుతున్నాయి. ఆ సంతకం ఈసీజీ గ్రాఫ్ లా ఉందని ఒకరు, సిస్మోగ్రాఫ్ లా ఉందని మరొకరు, ఈ సంతకం ప్రిస్క్రిప్షన్ లా ఉందని, కొత్త పెన్ ను కొనేముందు అది సరిగా రాస్తుందో లేదో చెక్ చేసేందుకు ఎలా అయితే రాస్తామో, ఆ సంతకం అలా ఉందంటూ ఎవరికి తోచిన రీతిలో వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గేట్–2021లో ఈ ప్రశ్న అడుగుతారేమోనని, మోదీ ఆలింగనం చేసుకున్నప్పుడల్లా ట్రంప్ హార్ట్ బీట్ లా ఉందని, హైదరాబాద్ లోని దుర్గం చెరువు దగ్గర వేలాడుతున్న బ్రిడ్జిలా ఉందేంటంటూ సెటైర్లు కురిపించారు.
Once In childhood I did same signature like Donald trump but that time my friend called me a potential doctor .#NamasteyTrump pic.twitter.com/DjwrmYmAIu
— JOSH ⚡?? (@NobitakaDost) February 24, 2020
I showed Trump’s signature to my pharmacist, he gave me medicines for 3 days. #TrumpInIndia pic.twitter.com/s40bMyUgip
— Sagar (@sagarcasm) February 24, 2020
Trump’s signature reminds me of ecg ? #TrumpInIndia pic.twitter.com/L2iMGvJ4Ez
— Prakash Shetty (@kitneka) February 24, 2020