ప్రభుత్వ అధికారులు చేసే తప్పులు అన్నీ ఇన్నీ కావు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ముఖ్యంగా ఓటర్ కార్డుల విషయంలో అధికారుల తప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకరి ఫోటో బదులు మరొకరి ఫోటో, ఒకరి పేరు బదులు మరొకరి పేరు, ఒకరి అడ్రస్ బదులు మరొకరి అడ్రస్ ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కనీస జాగ్రత్తలు కూడా చాలా మంది అధికారులు తీసుకునే పరిస్థితి ఉండదు.
ఇటీవలి కాలంలో ఈ రచ్చ ఎక్కువైపోయంది. ఓటు కార్డు ఉన్న వాళ్ళు ఏమో ఓటు వేద్దామని వెళ్తే ఇది మీ ఫోటో కాదు మరొకరిది అంటూ వెనక్కి పంపిస్తారు అధికారులు. మరి అంత ఇది ఉన్నప్పుడు కార్డులు తయారు చేసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాని అక్కడ ఉండదు వాళ్ళ శ్రద్ధ. తాజాగా ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటరు జాబితాలో జరిగిన ఒక తప్పు మహిళా ఓటర్ని షాక్ కి గురి చేసింది. మహిళా ఓటరుకు బదులుగా సినీ నటుడు వెంకటేష్ చిత్రం ప్రింట్ అవ్వడంతో ఆమె షాక్ అయ్యారు. దీనితో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని 31వ వార్డులో కూడా ఓటరు జాబితాలో ఫోటోలు తారుమారు అయినట్టు గుర్తించిన అధికారులు ఇక నుంచి తప్పులు లేకుండా జాగ్రత్తపడతామని చెప్పారు.