షాకింగ్:హీరో అర్జున్ ,విశ్వక్ వివాదం! అసలు కారణం ఇదేనా.!

-

సీనియర్ హీరో అర్జున్ , యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య రీసెంట్ గా జరిగిన వివాదం గురించి తెలిసిందే. దీనిపై తెర వెనుక చాలా విషయాలు జరిగాయని తెలుస్తోంది. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని అర్జున్, ఎప్పుడూ వివాదాలలో వుండే విస్వక్ సేన్ మధ్య గొడవతో అందరి వేళ్ళు విస్వక్ సేన్ వైపే చూపిస్తున్నాయి.

ఈ వివాదం తో అర్జున్ తన కూతురు హీరోయిన్ గా విశ్వక్ హీరోగా నటిస్తున్న సినిమా మధ్యలోనే ఆగిపోయింది. హీరో అర్జున్ ఈ యువ హీరోకి అసలు కమిట్మెంట్ లేదని.. దర్శక నిర్మాతలు అంటే గౌరవం లేదని పేర్కొన్నారు. ఈ రోజు షూటింగ్ పెట్టుకొని మార్నింగ్ కాల్ చేసి షూటింగ్ కాన్సిల్ చేయాలని అంటే ఎలా అని గట్టిగా ప్రశ్నించాడు. అయితే నేను స్క్రిప్టు లో కొన్ని మార్పులు చేయమన్నా ను, అప్పటిదాకా షూటింగ్ ఆపమని చెప్పానని, కాక పోతే అదే రోజు చెప్పడం నా తప్పేనని  విశ్వక్ ఒప్పుకున్నాడు.

అయితే ఆ రోజు షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకోమని సదరు హీరో కోరడం వెనుక వేరే రీజన్ ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. వాస్తవానికి షూటింగ్ ముందు రోజు రాత్రి ఓ స్టార్ హీరో పార్టీకి యువ హీరో హాజరయ్యాడట. ఆ పార్టీలో యువ హీరో తెల్లారే దాకా ఎంజాయ్ చేశాడట. ఇక ఆ మత్తులో షూటింగ్ కు వెళ్లలేని హీరో షూటింగ్ కాన్సిల్ చేయాలని చెప్పాడట. దీనితో మండి పోయిన సీనియర్ హీరో  ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా అయ్యింది అని షూటింగ్ నుండి హీరో ను సినిమా నుండి తప్పించాడట.

Read more RELATED
Recommended to you

Latest news