Breaking : నేడు జ్ఞానవాపీ కేసులో కీలక తీర్పు

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్ఞానవాపీ మసీదు కేసులో వారణాసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనుంది.
జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని కొలనులో గుర్తించిన శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వారణాసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో హిందూ పక్షాలు లేవనెత్తిన మూడు డిమాండ్లపై సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. తక్షణమే స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్‌కు పూజలు చేసుకునేందుకు అనుమతి, జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్‌ను హిందువులకు అప్పగించడం, మసీదులోకి ముస్లింలను ప్రవేశించకుండా నిషేధించడం వంటి మూడు డిమాండ్లపై నిర్ణయం తీసుకోనుంది ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.

Gyanvapi mosque committee files objection to demand for survey of tahkhanas

జ్ఞానవాపీ మసీదులోకి ప్రస్తుతం ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు అనుమతించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘శివలింగం’పై శాస్త్రీయ అధ్యయనానికి అక్టోబరు నాటి విచారణలో న్యాయస్థానం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. వీడియో సర్వే సమయంలో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేలా ఆదేశాలు వెలువరించాలని హిందూ పక్షాలు సెప్టెంబరు 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, ఇది శివలింగం కాదని, ఫౌంటెయిన్ అని ముస్లింలు వాదిస్తున్నారు. కార్బన్ డేటింగ్‌కు వారణాసి కోర్టు నిరాకరించడాన్ని హిందూ పక్షాలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్నాయి. ‘భారత పురావస్తు శాఖ (ASI) సర్వేకు ఆదేశించడం సరైంది కాదు.. అటువంటి ఉత్తర్వు ఇవ్వడం ద్వారా శివలింగం వయస్సు, స్వభావం, నిర్మాణం గురించి తెలుసుకోవచ్చు.. కానీ ఇది కూడా సాధ్యమయ్యే అవకాశాన్ని సూచించదు. న్యాయమైన పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది’ అని వారణాసి కోర్టు అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Latest news