సమంత కొత్త సినిమా యశోద ఫలితం పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అనే సరికి అందరూ అంత బడ్జెట్ పెట్టారా అని ఆశ్చర్యపోయారు. ఇది సమంత మీద కాన్ఫిడెన్స్ వుండి పెట్టారా లేక కథ మీద నమ్మకమా అని చాలా మంది మొహం మీద అన్నారట.కాని ఈ సినిమా పై నిర్మాత చాలా ఆలోచించి మాత్రమే అంత ఖర్చు పెట్టాలని నిర్ణయించారు.
ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం.. నాన్ థియేట్రికల్ హక్కులకు 30 కోట్లకు పైగానే వచ్చిందట.అది కూడా డిజిటల్ రైట్స్ – రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు మరియు ఓవర్ సీస్ అమ్మడం ద్వారానే వచ్చాయని అంటున్నారు. ఇక మిగిలిన భాషల ద్వారా వచ్చే వసూళ్ల లెక్కల తో సినిమా సేఫ్ అవుతుంది అని అంటున్నారు.
ప్రస్తుతం ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సోమవారం, మంగళ వారం కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయట. ఇక వరల్డ్ వైడ్ గా 23 కోట్లు దాకా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 5 లక్షల డాలర్స్ మార్క్ ని చేరుకొని హాఫ్ మిలియన్ క్లబ్ లో అయితే ఎంటర్ అయ్యింది. ఇక్కడ ఇంకా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కి ఇన్ని వసూళ్ల అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చూస్తూంటే సమంత మీడియం రేంజ్ హీరోల మార్కెట్ లకు దగ్గరగా వుందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.