Redmi 10 Power: రూ.12 వేలకే 8GB+128GB స్టోరేజ్‌తో స్మార్ట్‌ ఫోన్‌..!!

-

మొన్నటివరకూ ఫెస్టివల్‌ సేల్‌ నడిచింది..ఆఫర్లలో చాలామంది కొత్త ఫోన్‌ తీశారు. అప్పుడు కొనలేకపోయిన వారికి ఇది శుభవార్తే. అమెజాన్‌లో రెడ్‌మీ 10 పవర్ (Redmi 10 Power) 8GB+128GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,000 లోపే సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరకే ఎక్కువ ర్యామ్‌తో లభిస్తున్న మొబైల్ ఇదే కావడం విశేషం.

Redmi 10 Power ధర..

రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు మరింత తగ్గింది. ప్రస్తుతం రెడ్‌మీ 10 పవర్ రూ.12,499 ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, ఫెడరల్ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ కార్డులతో కొంటే డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో రెడ్‌మీ 10 పవర్ మొబైల్‌ను రూ.12,000 లోపే కొనొచ్చు.

Redmi 10 Power స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్..

రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇదే ప్రాసెసర్ రియల్‌మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్‌మీ 10, రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్లలో ఉంది.
రెడ్‌మీ 10 పవర్ కేవలం 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజైంది.
ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఆర్ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
రెడ్‌మీ 10 పవర్ కేవలం 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజైంది.
ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆర్ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది
రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో కేవలం 10వాట్ ఛార్జింగ్ అడాప్టర్ మాత్రమే లభిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ స్లాట్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్లాక్, స్పోర్టీ ఆరెంజ్ కలర్స్‌లో కొనొచ్చు.

కెమెరా క్వాలిటీ..

రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ పోర్ట్‌రైట్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news