అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. రేపు కృష్ణాయపాలెం లేఅవుట్ కు సీఎం జగన్ రానున్నారు. ఇళ్ల నిర్మాణ పైలాన్ ను ఆవిష్కరించి మోడల్ హౌస్ ను సందర్శిస్తారు. 47 వేల మంది లబ్ధిదారులకు రేపు అనుమతి పత్రాలు అందజేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా, ఆర్-5 జోన్ లో ఇళ్ళ నిర్మాణాలపై హైకోర్టు అలర్ట్ తీర్పు రిజర్వులో ఉంది. కాగా, ‘వాహన మిత్ర’ పథకాన్ని ఏటా (రూ.10000) వృత్తి ప్రాతిపాదికగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అందుకే కల్లుగీత కార్మికులు, చర్మకారులకిచ్చే సామాజిక పింఛన్ పొందేవారు వాహనమిత్రకు అనర్హులని పేర్కొంది. అలాగే అంగన్వాడి, ఆశా కార్యకర్తలను కాపు నేస్తానికి (ఏటా రూ.15000) అనర్హులుగా పేర్కొంది. వారి కుటుంబంలో మరొకరు ఈ పథకానికి అర్హులు అయితే వర్తింపజేస్తామని సచివాలయాలకు సమాచారం పంపింది.