ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో చోటు కల్పించలేదు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.అయ్యర్ 2023 ప్రపంచకప్లో అద్భుతంగా ఆడి 530 పరుగులు చేశారని, సెమీ ఫైనల్లో 70 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టారని గుర్తుచేసుకుంటున్నారు. ఇదంతా మర్చిపోయి కేవలం 3 నెలల వ్యవధిలోనే అతన్ని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించడం సరికాదని మండిపడుతున్నారు.
అయితే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయాల్లో దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ తాజా ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని వీరిద్దరికీ ఇటీవల బీసీసీఐ చురకలు అంటించింది. దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ కి మొండిచేయి ఎదురైంది.బీసీసీఐ ప్రకటించిన క్రికెటర్ల రిటైనర్షిప్ లో గ్రేడ్ A+లో విరాట్ కోహ్లి,రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ Aలో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, kl రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.