నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఇష్యూపై తనదైన బూతులతో పోస్టులు చేస్తూ రచ్చరచ్చ చేస్తుంటుంది శ్రీరెడ్డి. ఈ ఐటంబాంబు ఎప్పుడు ఎవరిపై పేలుతుందోనని అంతా భయపడుతుంటారు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. తరచూ ఏదో ఒక హీరోపై కామెంట్లు చేస్తూ సంచలనంగా మారుతుంటుంది.
ఇక పవన్ అంటేనే ఒంటికాలిపై లేస్తుంది. అప్పుడప్పుడు వేరే హీరోలపై కూడా బోల్డ్ కామెంట్లు చేస్తుంది. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ యంగ్‌హీరోపై ఆసక్తికర కామెంట్లు చేసింది. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌ను కూడా వాడేసింది.
తమిళహీరో, డీఎంకే యువనేత, స్టాలిన్ కొడుకైన ఉదయనిధి రీసెంట్‌గా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే ఆయనను ఉద్ధేశించి మీరు మా యంగ్ ఎమ్మెల్యే. మీరు మా జగన్‌లాగా ఎంతో ఎత్తుకు ఎదగాలని రాసుకొచ్చింది. అంతే కాదు ఇందుల పవన్‌ను కూడా ఇరికించింది. ఆయన్ను చూసి బుద్ధి తెచ్చుకో అంటూ పవన్‌పై విరుచుకుపడింది. నువ్వు ఇక ఎప్పటికీ తోకపార్టీనే అంటూ జనసేనను ఉద్ధేశించి సంచలన కామెంట్లు చేసింది. దీంతో ఈమె పోస్టుపై మిశ్రమ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.