కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవీకి శ్యామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన రాజీనామాను ఆమోదించారు. పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇటీవలే వివాదస్పదంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతదేశంలోని భిన్నత్వంపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి.
భారత్ లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రజలు చైనా వారిని పోలి ఉంటారు. దక్షిణ వైపు ఉన్న ప్రజల అరబ్ వారిలా ఉంటారు. ఉత్తర దిక్కు ఉన్న వాళ్లు నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఆఫ్రికా వారిలా కనిపిస్తారని శ్యామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సైతం ఎక్స్ లో స్పందించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇవాళ వరంగల్ సభలో, రాజంపేట సభలో ప్రధాని నరేంద్ర మోడీ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను ప్రస్తావించడం గమనార్హం.