ఆస్కార్ బరిలో నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా!

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా సినిమా శ్యామ్‌ సింగరాయ్‌. ఈ మూవీ క్రిస్మస్‌ కానుకగా గతేడాది డిసెంబర్ 24 వ తేదీన విడుదలై.. మంచి కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా.. నాని రెండు డిఫరెంట్‌ లుక్స్‌ లో కనిపించి…అందరినీ కనువిందు చేశాడు.

బెంగాల్ నేపథ్యం ఉన్న కథను తీసుకుని చిత్ర బందం ఓ సందేశం ఇచ్చింది. ఈ సినిమా కు సాయిపల్లవి నటన చాలా పాజిటివ్‌ గా మారింది. ట్యాక్సీవాలా ఫేం రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌ లోనూ మంచి వసూళ్లను రాబట్టింది.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచినట్లు సమాచారం అందుతోంది. ఏకంగా మూడు కేటగిరిల్లో ఈ సినిమా బరిలో ఉన్నట్లు సమాచారం. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, క్లాసికల్‌ కల్చరల్‌ డ్యాన్స్‌ ఇండీ ఫిల్మ్‌, పీరియాడికల్‌ ఫిల్మ్‌ కేటగిరిల్లో ఆస్కార్‌ నామినేషన్లకు పోటీ పడుతోందని ఓ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. అయితే.. ఇప్పటి వరకు దీనిపై చిత్ర బృందం మాత్రం ప్రకటన చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news