లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. మీ ఇంట్లో ఈ వస్తువులు ఉండాల్సిందే..

-

వాస్తుని నమ్మేవారు ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే ఉండాలని కోరుకుంటారు. ఉండాల్సిన వస్తువు ఉండాల్సిన చోట లేకుంటే ఇంట్లో ఏదో అపచారం జరుగుతుందని భావిస్తుంటారు. ఇంట్లో తాబేలు, లాఫింగ్ బుద్ధా వంటి వస్తువులు ఉంటే మంచిదని నమ్ముతుంటారు. అలాగే మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏంటి.. మీ ఇంట్లో ఉన్నాయా.. ఓసారి లుక్కేయండి.

మనీ ఫ్రాగ్..   మూడు కాళ్ల టోడ్ లేదా ఫెంగ్ షుయ్ మనీ ఫ్రాగ్  అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి. డబ్బులు దాచే చోట కూడా పెట్టొచ్చు. వంటగది, వాష్ రూమ్స్ లో అస్సలు ఉంచకూడదు..తెలియకుండా ఇలాంటి ప్లేస్ లో పెడితే జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కప్పలు ఉంచాలనుకుంటే వాటి సంఖ్య  3, 6 లేదా 9 ఉండేలా చూడండి.కలిసొస్తుందనే ఉద్దేశంతో ఇంతకన్నా ఎక్కువ పెట్టకండి. దీన్ని నేలపై నుంచి కొంచెం ఎత్తులో ఉంచాలి.

లాఫింగ్ బుద్ధ..   చైనా వినాయకుడుగా పిలిచే లాఫింగ్ బుద్ధను కూడా ఇంటి ఎంట్రన్స్ లోనే ఉంచాలి. లాఫింగ్ బుద్ధ ముఖంలో ఉంటే పెద్ద చిరునవ్వు నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి ..శుభాన్ని ఆహ్వానిస్తుందంటారు. లాఫింగ్ బుద్ద ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం రెండూ ఉంటాయని చెబుతారు. ఇంట్లో, కార్యాలయంలో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా లాఫింగ్  బుద్ధని  పెడితే అంతా శుభమే అని విశ్వసిస్తారు. అయితే ఈ బొమ్మను ఎవరికి వారు కొనుక్కోకూడదు.. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం.

గోల్డెన్ ఫిష్..    ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం ఇంట్లో గోల్డెన్ ఫిష్ ఉంటే అది ఆనందానికి, సమరస్యానికి ప్రతీకగా నమ్ముతారు. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతారంటారు. ఈ చేపను డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవాలి. దీన్ని ఇంట్లో పెట్టుకున్న రోజునుంచీ మీ సక్సెస్ ని మీరే గమనిస్తారు.

మూడు చైనీస్ నాణేలు..   చైనీస్ నాణేలు సంపదకు మూలంగా పరిగణిస్తారు. వృత్తాకార నాణేలు దాని రెండు వైపులా యిన్ , యాంగ్‌లను సూచిస్తాయి. యాంగ్ యొక్క నాలుగు వైపులా నాలుగు అక్షరాలు చెక్కి ఉంటాయి. యిన్‌లో రెండు అక్షరాలు ఉండొచ్చు లేదంటే ఖాళీగా కూడా ఉండొచ్చు. నాణేల గుండ్రటి ఆకారం స్వర్గాన్ని, చతురస్రాకారపు ఆకారం భూమిని సూచిస్తుంది. సాధారణంగా మూడు, ఆరు లేదా తొమ్మిది ఫెంగ్ షుయ్ నాణేల బంచ్‌లు ఎరుపు లేదా పసుపు రంగు రిబ్బన్‌తో ముడేసి పెడతారు. ఫెంగ్ షుయ్ లో ఎరుపు శుభప్రదమైన రంగు, ప్రాణశక్తికి సూచన. ఎరుపు రిబ్బన్‌తో ముడేసిన చైనీస్ నాణేలను ఇంటి ప్రధాన ద్వారం వెనుక ఉంచాలి.

చైనీస్ తాబేలు..   ఫెంగ్ షుయ్ , వాస్తు శాస్త్రం ఈ రెండూ కూడా తాబేలును అదృష్టానికి కేరాఫ్ గా పరిగణిస్తాయి. తాబేలు బొమ్మను ఉత్తర దిశలో ఉంచడం వల్ల జీవితంలో వైఫల్యం అనే మాటే వినిపించదంటారు వాస్తు నిపుణులు.

ఫౌంటెన్..   గదిలో ఫౌంటెన్ సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. ఇది వ్యక్తుల మధ్య ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుందట.

వేలాడే అద్దాలు..    ఇంట్లో వేలాడే అద్దాలు చాలా సానుకూలా వాతావరణం నింపుతాయి. వేలాడే అద్దాలు నెగిటివ్ వైబ్రేషన్స్ ని తరిమేస్తాయంటారు. అయితే అద్దాన్ని ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు ఉంచకూడదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోపలకు వచ్చే సానుకూల వైబ్స్ ని అద్దం వెనుతిరిగి పంపించేస్తుందట.

నిజమైన మొక్కలు..   ప్లాస్టిక్ హంగులు ఆర్భాటాలు కాకుండా ఇంట్లో నిజమైన మొక్కలు పెట్టుకుంటే ప్రశాంత వాతావరణం ఉన్నట్టే.  ఎల్లప్పుడూ  ఇంట్లో ఎప్పుడూ తాజా పూలను ఉంచేందుకు కూడా ప్రయత్నించండి. ఎందుకంటే జీవితంలో ఆనందం, ప్రేమకు చిహ్నం పూలు. పచ్చటి మొక్కలు, అందమైన పూలు ప్రతికూల శక్తిని దరిదాపుల్లో రానివ్వవు.

Read more RELATED
Recommended to you

Latest news