BREAKING : “SI” పరీక్ష తేదీలు ప్రకటన

-

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సై అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్త కాసేపటి క్రితమే వచ్చింది. TSLPRB తెలంగాణాలో ఉన్న ఎస్సై పోస్ట్ లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటిఫికేషన్ ద్వారా పరీక్షాహాల్ తేదీలు ఈ రోజు సదరు శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 8 మరియు 9 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత అదే తేదీలలో మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

 

ఇక అభ్యర్థులు తమ హాల్ టికెట్ లను సోమవారం నుండి అంటే ఏప్రిల్ 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని TSLPRB కల్పించింది. మీరు హాల్ టికెట్ ను ప్రింట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ రీసెంట్ ఫోటో ను అతికించాల్సి ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news