వైశాఖమాసం ప్రాముఖ్యత… చేయాల్సిన వ్రతాలు, దానాలివే..!

-

సనాతన ధర్మంలో ప్రతీ ఒక్క పండుగ మాసం వెనుక అనేక అర్ధాలు పరమార్థాలు ఉంటాయి. వాటిని శాస్త్రీయంగా తెలుసుకోలేక అనేక విమర్శలు చేస్తుంటాం. కానీ పూర్వీకుల ఆచారాలు సైన్స్‌ పెరుగుతుంటే మరింతగా మనకు అర్థమవుతున్నాయి. అలాగే తెలుగు కొత్త సంవత్సరాది ప్రారంభమై నెల పూర్తయింది. ప్రస్తుతం వైశాఖమాసం ప్రారంభమైంది. అంటే తెలుగు మాసాలలో రెండో నెల. ప్రకృతి పరంగా చూస్తే వసంత రుతువు. అంటే దాదాపు ప్రకృతిలోని ప్రతీచెట్టు కొత్తదనాన్ని సంతరించుకునే రోజులు ఇవి. ఈ చైత్రవైశాఖలను మధుమాధవమాసాలని కూడా వ్యవహరిస్తారు. ఈ కాలంలో యమదంష్ట్రలు బయటకు వస్తాయి కాబట్టి వసంతనవరాత్రులు చేసుకుని జాగ్రత్తగా జీవితాన్ని గడుపుతాం. అయితే ఈ మాసంలో ప్రత్యేకతలు తెలుసుకుందాం…

వైశాఖము, మాఘము, కార్తీకం – ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు.  ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో  అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు.  ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంత రుతువులో రెండవ మాసం. ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.

వైశాఖంలో రకరకాల వ్రతాలు

వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది.  అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తున్నారు.

ధారాపాత్రతో శివారాధన – శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే   అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. శివాలయాలలో శివునకు పైన గళంతిక దీన్నే ధారాపాత్ర అంటారు. దీన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే దారాపాత్ర అంటారు. వైశాఖంలో ఉదకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో తప్పక చేయాలి.

శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news