కరోనా వైరస్ నుంచి సాధారణంగా ఎన్ని రోజుల్లో బయటపడతారు…? కనీసం రెండు వారాలు. లేదు అంటే మూడు వారాలు. కొంత మందికి నెల రోజులకు పైగా పడుతుంది. కాని 9 నెలల చిన్నారి మాత్రం కేవలం ఆరు రోజుల్లో కరోనా వైరస్ ని జయించాడు ఉత్తరాఖండ్‌లో కరోనా లక్షణాలతో 9 నెలల వయసున్న ఓ పసికందును ఆస్పత్రిలో జాయిన్ చేసారు. ఈ నెల 17 న ఆస్పత్రిలో జాయిన్ చేసి పరిక్షలు చేసారు.
పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. శిశువు తండ్రి తబ్లీగా జమాత్‌కు వెళ్లగా అతని నుంచి కరోనా వైరస్ సోకింది. దీనితో అతని నుంచి కుమారుడు కి కరోనా వచ్చింది. ప్రస్తుతం అతని తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారికి చాలా జాగ్రత్తగా వైద్యం చేసారు వైద్యులు. ఆ పిల్లాడికి జ్వరం, జలుబు, దగ్గు అన్నీ తగ్గడంతో పరిక్షలు నిర్వహించారు వైద్యులు. 48 గంటల వ్యవధిలో రెండుసార్లు కరోనా నెగిటివ్ వచ్చింది.
ఆ చిన్నారి తండ్రి నుంచి ఎవరికి కరోనా రాలేదు. కుటుంబ సభ్యులు ఎవరికి రాలేదు. తల్లి సహా ఆ ఇంట్లోని వారందరికీ కరోనా నెగిటివ్ వచ్చింది. పాలు తాగే వయసు కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుని వైద్యం చేసామని వైద్యులు చెప్పారు. ఆ పసికందు కోసం మందులను ఎక్కువగా వాడలేదట.