ZIM AFRO T 20: ఆల్ రౌండర్ సికందర్ రాజా 5 సిక్సులతో మెరుపులు … !

-

ఈ రోజు నుండి జింబాబ్వే వేదికగా జిమ్ ఆఫ్రో టీ 20 లీగ్ ప్రారంభం అయింది. ఈ టోర్నీలో మొత్తం అయిదు జట్లు పాల్గొంటున్నాయి. కాగా షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు బులవాయో బ్రేవ్స్ మరియు హారర్ హర్రికేన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బులవాయో బ్రేవ్స్ నిర్ణీత 10 ఓవర్ లలో 128 పరుగులు చేసింది. ఒక దశలో బులవాయో 100 పరుగులు చేస్తుందా అనిపించింది. కానీ కెప్టెన్ సికందర్ రాజా గ్రౌండ్ కు నాలుగు వైపులా బ్యాట్ ను జుళిపిస్తూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు. ఇతను తాను ఎదుర్కొన్న 31 బంతుల్లో నాలుగు ఫోర్లు మరియు 5 సిక్సులతో 61 పరుగులు సాధించాడు. టీం లో అందరూ అవుట్ అయినా.. సికందర్ రాజా ఒక్కడే సొంత గ్రౌండ్ పై చెలరేగి ఆడాడు.

టీ 10 లో ఈ టార్గెట్ ను చేదిచడం హారర్ కు కష్టమే అని చెప్పాలి.. ఇప్పటికే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఏమైనా అద్భుతం జరిగితే తప్పించి గెలుపు సాధ్యం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news