హైదరాబాద్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంట వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలన్నారు.
దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మంత్రి తలసాని శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో ప్రస్తుత పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు నీటి విడదుల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలని మంత్రి ఆదేశించారు.