సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆ సంస్థతో సంబంధం ఉన్న మీడియా ఛానెళ్లు బ్లాక్

-

ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సంబంధాలు ఉన్న సిఖ్స్ ఫర్ జస్టిస్ జస్టిస్ సంస్థపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఆ సంస్థతో సంబంధం ఉన్న మీడియా ఛానెళ్లను బ్లాక్ చేస్తోంది. తాజాగా ఆ సంస్థతో సంబంధం ఉండి..‘‘ పంజాబ్ పొలిటిక్స్ టీవీ’’ని బ్లాక్ చేసింది. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మెషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ తనకున్న అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకుంది.

రైతుల ఉద్యమంలో, ఎర్రకోటపై జెండా ఎగరేయడంలో సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. ఆ సంస్థకు చెందిన కొందరు గతంలో వీడియోలు కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ.. కాన్వాయ్ ని అడ్డగించిన ఘటనలో కూడా ఈ సంస్థకు లింకులు ఉన్నాయి. స్వయంగా సిఖ్స్ ఫర్ జస్టిస్ ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news