హాట్ షాట్ కేసు.. శిల్పాకు వాటా ఉందా?.. మరోసారి ప్రశ్నిస్తారా?.

-

ముంబై: పోర్న్ రాకెట్ కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ కేసులో రాజ్‌కుంద్రాతో పాటు శిల్పాశెట్టిని పోలీసులు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాలపై ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో శిల్పాకు వాటా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీశారు. రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ కంపెనీ డైరెక్టర్లలో శిల్పా శెట్టి ఒకరిగా ఉన్నారు. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే వియాన్‌ సంస్థలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన శిల్పా.. గతేడాది రాజీనామా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల కారణాలపైనా ప్రశ్నించారు. సంస్థకు చెందిన డబ్బు నుంచి శిల్పాకు ఏమైనా ప్రయోజనం కలిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే శిల్పాశెట్టిని పోలీసులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news