తెలంగాణలో పంటల భీమా పథకం లేదు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

కాంగ్రెస్ నేత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణలో పథకాలు సరిగ్గా అమలు కావట్లేదని, అందుకు ఉదాహరణగా పంటల భీమా పథకాన్ని ముందుకు తీసుకువచ్చారు. పంటల భీమా పథకం ప్రీమియాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదని, అందువల్ల తెలంగాణలో పంటల భీమా పథకం లేనట్టే అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర స్పష్టం చేసిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా ఫెయిల్ అయ్యిందని, జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేసారు. కేంద్ర నుండి నల్గొండ జిల్లాకు రావాల్సిన నిధుల విషయంలో తాను కృషి చేస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news