పెదాలు నల్లగా అవ్వకూడదంటే.. ఈ తప్పులు చెయ్యకండి..!

-

మనం అందంగా కనిపించడానికి మన నవ్వు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన నవ్వు బాగుండాలంటే మన దంతాలు మన పెదవులు అందంగా కనిపించాలి. చాలా మంది కి పెదాలు నల్లగా మారిపోతూ ఉంటాయి గులాబీ రంగు లో ఉండాల్సిన పెదవులు నల్లగా మారిపోతే చూడడానికి బాగోదు సరి కదా మన అందం పాడవుతుంది. పెదవులు నల్లగా మారిపోకుండా ఉండాలంటే ఈ అలవాట్లకి దూరంగా ఉండండి.

ఈ తప్పులను చేస్తే కచ్చితంగా పెదవులు నల్లగా అయిపోతాయి స్మోక్ చేయడం వల్ల పెదాలు నల్లగా మారిపోతాయి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్లు ఆ అలవాటు మానేస్తే పెదవులు నల్లగా మారిపోకుండా ఉంటాయి. అలానే హైడ్రేట్ గా పెదవులు ఉంచుకోవడం చాలా ముఖ్యం పెదవులు హైడ్రేట్ గా ఉంటే నల్లగా మారిపోవు. మంచి లిప్ బామ్ ని పెదవులకు అప్లై చేసుకుంటే పెదవులు అందంగా ఉంటాయి.

కోకో,షియా బటర్ వంటివి కలిగి ఉన్న లిప్ బామ్స్ ని ఉపయోగించండి. అప్పుడు బాగుంటాయి. అలానే పెదవులను చాలామంది పదే పదే తడుపుతూ ఉంటారు అలా చేసినా కూడా పెదవులు నల్లగా మారిపోతూ ఉంటాయి. పెదవులకి మంచి ప్రొడక్ట్స్ ని మాత్రమే ఉపయోగించండి తక్కువ క్వాలిటీ ఉన్న వాటిని ఉపయోగించడం వలన కూడా హాని కలుగుతుంది. ఎస్పీఎఫ్ 30 కూడి ఉన్న లిప్ బామ్ ని ఉపయోగిస్తే పెదవులు బాగుంటాయి పెదాలకి ప్రొటెక్షన్ లభిస్తుంది అందంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news