త‌ర‌చూ క‌ళ్లు ఉబ్బిపోయి ఇబ్బందులు పెడుతున్నాయా..? ఇలా చేయండి..!

-

ప‌ని ఒత్త‌డి.. ఆందోళ‌న‌.. మాన‌సిక స‌మ‌స్య‌లు.. నిద్ర స‌రిగ్గా పోకపోవ‌డం.. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం.. మ‌ద్యం అతిగా సేవించ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల అధిక శాతం మందికి క‌ళ్లు ఉబ్బిపోతుంటాయి. అలాగే క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాలు కూడా వ‌స్తుంటాయి. వీటికి చింతించాల్సిన ప‌నిలేదు. కింద తెలిపిన ప‌లు చిట్కాలు పాటిస్తే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

simple tips to resolve puffy eyes problems

1. ఐస్ క్యూబ్‌ల‌తో చ‌ర్మంపై సున్నితంగా మ‌ర్ద‌నా చేస్తే క‌ళ్లు ఉబ్బి పోయిన స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే క‌ళ్ల కింద ఏర్ప‌డే న‌ల్ల‌ని వ‌ల‌యాలు కూడా త‌గ్గుతాయి. అందుకు గాను ఓ శుభ్ర‌మైన వ‌స్త్రంలో ఐస్‌క్యూబ్స్ వేసి చుట్టాలి. దాంతో క‌ళ్ల చుట్టూ సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. 3 నుంచి 5 నిమిషాల పాటు అలా చేస్తే ఫ‌లితం ఉంటుంది. నిత్యం రెండు సార్లు ఇలా చేస్తే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు.

2. టీ బ్యాగ్స్‌ను ఉప‌యోగించాక వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. అనంత‌రం వాటిని తీసుకుని క‌ళ్ల చుట్టూ రాయాలి. టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. క‌ళ్లు ఉబ్బిపోవ‌డం త‌గ్గుతుంది.

3. కోల్డ్ క్రీంను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా క‌ళ్లు ఉబ్బిపోయే స‌మ‌స్య నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు.

4. క‌ళ్ల‌పై కీర‌దోస ముక్క‌ల‌ను చ‌క్రాల్లా క‌ట్ చేసి పెట్టుకోవాలి. క‌నీసం 20 నిమిషాల పాటు నిత్యం 2 సార్లు అలా చేస్తే ఫ‌లితం ఉంటుంది.

5. ఎలాంటి క్రీములు, ఆయిల్స్ లేకున్నా.. క‌ళ్ల‌ను శుభ్రంగా క‌డిగి తుడిచి.. అనంత‌రం క‌ళ్ల చుట్టూ వేళ్ల‌తో మసాజ్ చేయాలి. దీని వ‌ల్ల ఆ ప్రాంతంలో ర‌క్త సర‌ఫ‌రా పెరుగుతుంది. క‌ళ్ల వాపు త‌గ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news