సబ్బం హరికి సూచన: హోమియోపతి వాడితే తగ్గిపోద్ది సార్!!

-

“హైటెక్ సిటీ కట్టింది నేనే (బిల్డింగ్ కాదు).. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలిపింది నేనే (గ్రాఫిక్స్ లో కాదు) .. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కట్టింది నేనే (వైఎస్సార్ లేరుగా).. ఔటర్ రింగ్ రోడ్డు వేసింది నేనే (రోడ్డుకి మాటలు రావుగా).. కంప్యూటర్ ని ఆంధ్రులకు పరిచయం చేసింది నేనే (పాపం) .. నేడు తెలుగువాడు గూగుల్ సీఈఓ అయినా.. సింధూ ఒలెంపిక్స్ కి వెళ్లినా కారణం నేనే (పైన దేవుడున్నాడు…వినేవాళ్లంటే అంత లోకువా)..” అని చంద్రబాబు చెప్పుకునే సంగతులు తెలిసినవే! అక్కడికే ఆ మాటలు విన్నవారికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిన సంగతి కాసేపు పక్కనపెడితే… “అంతకు మించి” అన్నస్థాయిలో చెలరేగిపోతున్నారు సబ్బం హరి!

అవును… నమ్మేవాడు నమ్మండి.. నమ్మని వ్యక్తులతో తనకు సంబంధం లేదు అన్న స్థాయిలో చెలరేగిపోతున్నారు సబ్బం హరి! “ఆఫ్టర్ సిక్స్” ఎఫెక్టో ఏమో కానీ… తాజాగా “ఘాజీ” సినిమాని గుర్తుకు తెచ్చారు హరి! తాజాగా ప్రముఖ పసుపు ఛానల్ అని పిలవబడే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన హరి గారు… విశాఖ‌కు ఘాజీ తెచ్చి పెట్టింది తా‌నే అని పలికారు! కాస్త ఇబ్బందిగా అనిపించినా వార్త పూర్తిగా చదవగలరని ఆశిస్తూ…!

ఇంత‌కీ “ఘాజీ” అంటే.. ఆ మ‌ధ్య రానా నటించిన సినిమా అనుకున్నారో ఏమో.. పైగా అదీ పాకిస్థాన్ కి సంబందించిన సబ్ మెరైన అని గ్రహించలేకున్నారో ఏమో కానీ… తీరా సినిమా తీశారంటే అదేదో గొప్ప‌దే అయ్యుంటుంద‌ని అనుకున్న హరన్న.. దాన్ని త‌నే తెచ్చిపెట్టిన‌ట్టుగా చెప్పుకున్నారు! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఘాజీ క‌థే ఈనాటిది కాదు! బాబే చెప్పుకుంటున్నారు కదా.. తాను అంతకు మించి చెప్పుకోవాలని తపించారో ఏమొ కానీ… ఘాజీని తెచ్చిపెట్టింది త‌నే అని సబ్బం హరి చెప్పేశారు! దీంతో… “హోమియోపతి వాడండి.. తగ్గిపోతుంది” అని నెటిజన్లు కామెట్లు చేస్తున్నారు!! తానెలా మిస్సయ్యానబ్బా అని బాబు ఫీలయితే… నేరం “హరి”ది కాదు… పాఠకులకు మనవి!

Read more RELATED
Recommended to you

Latest news