కరోనా నేపథ్యంలో ఇప్పటికీ విద్యార్థులు ఇంకా ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరు అవుతున్నారు. స్కైప్, జూమ్ వంటి మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. అయితే చెప్పేందుకు బాగానే ఉంది కానీ.. ఆన్‌లైన్ విధానం వల్ల అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి నెట్ ఉండదు. కొందరికి డివైస్‌లు ఉండవు. ఇంకా కొందరికి కరెంట్ ఉండదు. ఇలా మన దేశంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడ మాత్రం విద్యార్థులు కొత్త రకమైన ఇబ్బంది పడ్డారు. అదేమిటంటే..
సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ఓ మ్యాథ్స్ ప్రొఫెసర్ ఇటీవల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాస్ తీసుకున్నాడు. కానీ తన దగ్గర మ్యూట్ చేయడంతో విద్యార్థులకు ఆయన చెప్పే పాఠాలు అస్సలు ఏమీ వినబడలేదు. దీంతో సాంకేతిక సమస్య ఉందని తెలుసుకున్న కొందరు విద్యార్థులు కొంత సేపు వేచి చూశారు. అయినప్పటికీ ఆ ప్రొఫెసర్ చెప్పేది ఏమీ వినిపించకపోవడంతో చాలా మంది క్లాస్ నుంచి తప్పుకున్నారు. ఇక 2 గంటలపాటు క్లాస్ కొనసాగింది.
అయినప్పటికీ ఆ ప్రొఫెసర్ తన దగ్గర మ్యూట్ పెట్టే ఉండడంతో విద్యార్థులకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 2 గంటలుగా వెయిట్ చేసినా తమ ప్రొఫెసర్ చెబుతున్నది వాళ్లకు వినిపించలేదు. దీంతో కొందరు విద్యార్థులు క్లాస్ నుంచి వెళ్లిపోగా చివరకు 20 మంది మిగిలారు. అయితే 2 గంటల పాటు విద్యార్థులు ఆ ప్రొఫెసర్‌కు తమ సమస్యను తెలియజేసేందుకు శతవిధాలా యత్నించారు. ఆయనకు ఫోన్ కూడా చేశారు. కానీ ఆయన స్పందించలేదు. దీంతో తన వద్దే సమస్య ఉందని ఆ ప్రొఫెసర్ గుర్తించేందుకు 2 గంటల సమయం పట్టింది. చివరకు విషయం తెలుసుకున్న ఆ ప్రొఫెసర్ తీవ్రమైన అసహనానికి లోనయ్యాడు. అయితే తానే మిస్టేక్ చేశాడు కనుక కూల్ అయ్యి అదే క్లాస్‌ను మళ్లీ ఎప్పుడైనా తీసుకుంటానని విద్యార్థులకు తెలిపాడు. దీంతో క్లాస్ ఆ విధంగా ముగిసింది. 2 గంటలుగా ఆ విద్యార్థులు మాత్రం ఏం జరుగుతుందో తెలియక అలా చూస్తూనే ఉన్నారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసుల వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పటికి అనేక మందికి అర్థమైంది.