పోలీసుల మీద లిక్కర్ మాఫియా కాల్పులు, కానిస్టేబుల్ మృతి !

-

ఉత్తర ప్రదేశ్‌ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కాస్‌గంజ్‌ లో మద్యం స్మగ్లర్ లు పోలీసుల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా, సబ్ ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడైన కానిస్టేబుల్‌ను దేవేంద్రగా గుర్తించగా, ఎస్‌ఐని అశోక్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఇద్దరు పోలీసులు మోటి అనే రౌడీ షీటర్కు సంబందించిన ఆస్తి అటాచ్ చేసినందుకు లీగల్ నోటీసు ఇవ్వడానికి వెళ్ళినట్లు సమాచారం.

అతనిని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని భావించి అతని సహాయకులు మెరుపుదాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశం నుండి పారిపోయిన పోలీసులు అధికారులకు తెలియజేయడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించేందుకు గాను అదనపు బలగాలను పిలిచారు. సిధ్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగ్లా ధీమార్ గ్రామంలోని పొలంలో పోలీసు సిబ్బంది తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దేవేంద్ర గాయాల పాలై మరణించాడు. పోలీసు బృందం బైక్ ను అక్కడి నుంచి స్వాధీనం చేసుకుంది. మరో గుర్తు తెలియని బైక్ కూడా కనుగొనబడింది. పోలీసుల బైక్ వారి యూనిఫాం మరియు బూట్లు నేలమీద పడి ఉన్నాయి. దాడి చేసే ముందు యూనిఫాం తీసేసి వారు పోలీసులను అవమానించారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news