అ దేశంలో దోమలను పెంచుతున్నారు… ఎందుకంటే… వైరల్ వీడియో…!

-

దోమ… ఇప్పుడు ఈ పేరు వింటే చాలు జనం భయపడిపోతున్నారు… ప్రపంచ వ్యాప్తంగా దోమ వలన వచ్చే వ్యాధులతో ఎందరో అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు మనం చూస్తున్నా౦. ముఖ్యంగా డెంగ్యు బారిన పడి ప్రపంచ వ్యాపతంగా 20 వేల మంది ప్రతీ ఏటా చనిపోతున్నారు. 50 కోట్ల మంది ఆ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా సరే… దోమల బారిన ప్రజలు పడుతూనే ఉన్నారు ప్రాణాలు కూడా కోల్పోతునే ఉన్నారు.

ముఖ్యంగా ఆ దోమల బారిన పడకుండా… అనేక రసాయనాలు కూడా ప్రభుత్వాలు ప్రయోగిస్తున్నాయి. తాత్కాలిక ఉపశమనమే గాని ఉపయోగం ఉండటం లేదు. దీనితో సింగపూర్ శాస్త్రవేత్తల బృందం వినూత్నంగా ఆలోచించింది. ముల్లుని ముల్లుతోనే తియ్యాలి అంటూ భావించింది… అనుకున్నదే తడవుగా ప్రయోగాలను మొదలుపెట్టారు. వాళ్ళు ప్రత్యేకంగా దోమలను సృష్టించారు. అవి గుడ్లు పెట్టని దోమలు అన్నమాట. ప్రత్యేకంగా దోమల నర్సింగ్ రూమ్ అనే ఒక దానిని ఏర్పాటు చేసి… అందులో దోమలను పెంచుతున్నారు.

వాటిని లక్షలాదిగా గాల్లోకి విడుదల చేస్తున్నారు. అవి మనుషులను కుట్టవు, మనకు ఎలాంటి హానీ తలపెట్టవు కూడా. అయితే అవి ఎం చేస్తాయి అంటే… గుడ్లు పెట్టె దోమలను శారీరకంగా కలుస్తాయి… తద్వారా హాని కలిగించే దోమల సంఖ్య అనేది తగ్గిపోతుంది. వాటికి గుడ్లు పెట్టె యోగం అనేది ఉండదు. సింగపూర్ లో అడవులు, పార్క్ లు, బహిరంగ ప్రదేశాల్లో భారీగా వాటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు హాని కలిగించే దోమల సంఖ్య… సింగపూర్ లో భారీగా తగ్గిందని… భవిష్యత్తులో దీనిని ఎక్కువగా అమలు చేస్తామని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news