చెరుకు పొలంలో 17వ కాన్పు.. 20 సార్లు గర్భవతి..!

-

ఉత్తర భారత దేశంలో పిల్లలను కనడం అనేది చాలా మంది పరువుగా భావిస్తూ ఉంటారు. దీని వలన నష్టాలు ఉన్నాయని తెలిసినా సరే… చాలా మంది పెద్దగా లెక్క చేయరు… సమాజంలో వాళ్ళు అది ఒక గుర్తింపుగా కూడా భావిస్తూ ఉంటారు. ఇటీవల మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన కేసు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కరువు ప్రాంతం. దీనితో చాలా మంది అక్కడి నుంచి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు.

ముఖ్యంగా వారు కర్ణాటకలో చెరుకు పనులు చేయడానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ నేపధ్యంలోనే కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని చెరకు పనులకు… మజల్‌గావ్ తహసీల్ నివాసి అయిన లంకబాయి (పూర్తి పేరు వెల్లడించలేదు) వెళ్ళింది. ఈ నేపధ్యంలోనే ఆమె చెరుకు పొలంలో పనులు చేస్తూ… తన 17 వ బిడ్డకు జన్మనిచ్చింది. సంచార గోపాల్ వర్గానికి చెందిన ఈ మహిళ సెప్టెంబరులో 20 వ సారి గర్భవతి అని వైద్యులు గుర్తించారు… ఆమెకు 11 మంది పిల్లలు, వారిలో తొమ్మిది మంది బాలికలు ఉన్నారు.

ఆమెకు మూడు అబార్షన్లు ఉండగా, ఐదుగురు పిల్లలు చనిపోయారని వైద్యాధికారులు మీడియాకు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెను కలవడానికి కొందరు అధికారులు వెళ్ళారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి తమ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు గుర్తించారు. “లంకబాయి తన 17 వ బిడ్డకు జన్మనిచ్చినట్లు మేము తెలుసుకున్నాము, ఆమె వెంటనే మరణించింది. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని బీడ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఆర్బి పవార్ మీడియాకు చెప్పారు. వలస కూలీ అయి కూడా అంత మంది పిల్లలకు జన్మను ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news