చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.
ప్రముఖ గాయకుడు భూపీందర్ సింగ్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో సోమవారం మరణించారు. భూపీందర్ మరణాన్ని ఆయన భార్య మితాలీ సింగ్ వార్తా సంస్థ పిటిఐకి ధృవీకరించారు. ప్రముఖ గాయకుడు భూపీందర్ సింగ్ కి 82 సంవత్సరాలు.
భూపీందర్…. దో దీవానే షాహెర్ మే, హోకే మజ్బూర్ ముఝే ఉస్నే బులాయా హోగా, ఆనే సే ఉస్కే ఆయే బహార్, కిసీ నాజర్ కో తేరా ఇంతేజార్ ఆజ్ భీ హై, బీటీ నా బీతాయ్ రైనా, దిల్ ధూండతా హై, నామ్ గుమ్ జాయేగా వంటి అనేక హిట్ క్లాసిక్‌లను పాడారు. ఇక ప్రముఖ గాయకుడు భూపీందర్ సింగ్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.