ఒకప్పుడు మహిళలు తనమీద జరిగిన లైంగిక వేధింపులను బయట పెట్టాలంటే చాలా ఆలోచించేవారు. కానీ రోజులు మారాయి తమ మీద ఇలాంటివి ఎప్పుడో జరిగాయని కూడా ఇప్పుడు బయట పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సింగర్ నేహా బాసిన్ తన చిన్నప్పుడు తన మీద జరిగిన లైంగిక దాడుల గురించి వెల్లడించారు. తనకి పదేళ్ల వయసు ఉన్న సమయంలో తన తల్లితో కలిసి హరిద్వార్ దేవుడి దర్శనానికి వెళ్లాను అని, అయితే అక్కడికి క్యూలైన్లో తన తల్లి కొంచెం దూరంలో ఉండిపోవలసి వచ్చింది అని పేర్కొంది. ఆ సమయంలో ఒక కుర్రవాడు చెప్పుకోలేని చోట వేలుతో పొడిచాడు అని చెప్పుకొచ్చింది. అంతే కాదు మరి కొన్ని నెలల తర్వాత ఏకంగా ఒక వ్యక్తి తన ఎద భాగాన్ని పట్టుకుని చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ముందు ఈ విషయంలో తప్పు తనదేనని భావించానని కానీ ఆ విషయంలో తన తప్పు ఏమీ లేదని తర్వాత తెలిసిందని ఆమె బాధ పడింది. అంతే కాక సోషల్ మీడియా వేధింపుల విషయంలో కూడా కొన్ని కీలక కామెంట్ చేసింది. నిజానికి ఈమె కె బ్యాండ్ అనే ఒక మ్యూజిక్ బ్యాండ్ గురించి స్పందిస్తూ ఆ మ్యూజిక్ తనకు అంతగా నచ్చదు అని పేర్కొంది. దీంతో ఆ మ్యూజిక్ బ్యాండ్ అభిమానులు ఈమె మీద అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై స్పందిస్తూ ఆమె అలా కామెంట్ చేసే వాళ్ళని మోకాలు లేని టెర్రరిస్టులుగా అభివర్ణించింది.