ఇటీవల్ కరోనా బారిన పడి చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ ని ఆస్పత్రి వర్గాలు విడుదల చేసాయి. మొన్న సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించిన నేపధ్యంలో ఆయనను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆక్సీజన్ మాస్క్ సహాయం తో శ్వాస తీసుకునే పరిస్థితి ఉంది. ఆయన ఇంకా వెంటిలేటర్ మీదనే ఉన్నారని చెప్పింది.
ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుట పడలేదు అని, ఆయన కోలుకుంటున్నారు అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన కోలుకోవాలి అంటూ ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. బాలు ఆరోగ్యం కుదుటపడాలి అని ప్రముఖులు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.