ప్రెగ్నెన్సీ పుకార్లకు చెక్ పెట్టిన సింగర్ సునీత..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరిస్తున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటే ఒక పాటలా అనిపిస్తుంది అభిమానులకు.. అంతటి గొప్ప స్వరంతో ఆమె పాటలు పాడింది అంటే అచ్చం అమృతంలా అనిపిస్తుంది. అంతటి మధురమైన గొంతు ఉన్న గాయని సునీత.. ఈమె పాటలు పాడడమే కాదు తన అద్భుతమైన స్వరంతో ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. ఇదిలా ఉండగా ఈమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం చేసుకున్న తర్వాత పలు రకాల రూమర్లకు గురి అయింది.

త్వరలో ఆమె తల్లి కాబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. మొన్నటి వరకు వీటిపై స్పందించని సునీత రోజు రోజుకూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వాటిపై స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనిపై సునీత స్వయంగా స్పందిస్తూ నేను ప్రెగ్నెంటా..? ఆ విషయం నాకే తెలియదు అలా రూమర్ పుట్టిస్తున్నారు అంటే వారి ఆలోచన విధానానికే వదిలేస్తున్నాను.. నా జీవితాన్ని, నన్ను వారు ఏమి చేయలేరు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇకపోతే సునీత తనయుడు ఆకాష్ హీరోగా త్వరలోనే పరిచయం కానున్నాడు. సర్కార్ నౌకరి అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఆర్కే టెలి షో బ్యానర్ పై కే రాఘవేంద్రరావు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా హిట్ అయితే సునీత కొడుకు హీరోగా సక్సెస్ అయినట్టే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news