భక్తులకు అలర్ట్‌.. కొండగట్టు దర్శనాలు బంద్‌

-

తెలంగాణలో ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మనకు తెలుస్తూనే ఉంది. అయితే.. యాదాద్రి, జోగులాంబ ఆలయాలు సహా 35 ఆలయాల్ని ఆన్‌లైన్ చేయడమే కాదు.. ఎన్నో వసతులూ కల్పిస్తూ.. పర్యాటక క్షేత్రాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించేందుకు ఇవాళ వెళ్తున్నారు. ఈ ఆలయాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

ఆ విషయం తెలియక వచ్చిన భక్తులను పోలీసులు కొండ పైకి అనుమతించడం లేదు. దీంతో కొండ దిగువన ఉన్న ఆంజనేయ స్వామికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంతే కాకుడంగా సీఎం రాక నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల దుకాణాలను కూడా పోలీసులు మూసివేశారు. అంతకు మునుపు గంగాధర మండలం రేలపల్లికి చెందిన 9 మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గతంలో చర్లపల్లి బలవంతపూర్ మీదుగా తమ గ్రామానికి రోడ్డు వేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే మాట ఇచ్చి తప్పడంతో సీఎం ముందు తమ నిరసన తెలిపేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ… జగిత్యాల జిల్లా… మల్యాల మండలంలో ఉంది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. స్వామిని దర్శించుకుని, పూజలు చేయబోతున్నారు సీఎం కేసీఆర్ . ఆ తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి? ఏయే కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై అధికారులతో చర్చిస్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news