Samykuta : ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో సంయుక్త స్టన్నింగ్ లుక్స్

-

కేరళ కుట్టి సంయుక్త మరోసారి తన ఫొటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ భామ తాజాగా ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. వైట్ అండ్ పింక్ లెహంగాలో స్టన్నింగ్ ఫొటోషూట్ తో మనసు దోచేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఔట్ ఫిట్ లో సంయుక్త చాలా అందంగా కనిపిస్తోంది. అచ్చం తెలుగమ్మాయిలా ఉందంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతందంతో చంపేస్తున్నావు సంయూ అంటూ గారాలు పోతున్నారు. ఇక హార్ట్ ఎమోజీస్ తో తమ ప్రేమనంతా కామెంట్ బాక్సులో కురిపించేస్తున్నారు.

సంయుక్త సినిమాల సంగతికి వస్తే ఈ భామ భీమ్లా నాయక్ సినిమాలో రానాతో జతకట్టింది. ఇక ఇటీవల సార్ సినిమాలో ధనుష్ పక్కన మెరిసింది. ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడంతో సంయుక్తకు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news